ఆ పార్ట్‌పై ప్రభాస్ పేరు టాటూ వేయించుకున్న హీరోయిన్.. సంథింగ్ సంథింగ్...??

by Sujitha Rachapalli |
ఆ పార్ట్‌పై ప్రభాస్ పేరు టాటూ వేయించుకున్న హీరోయిన్.. సంథింగ్ సంథింగ్...??
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ దిశా పాఠానీ 'Kalki 2898 AD ' లో నటించింది. కానీ ఆమె క్యారెక్టర్ గెస్ట్ రోల్ కు ఎక్కువ సపోర్టింగ్ రోల్ కు తక్కువ అన్నట్లుగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆమె ఒప్పుకోకపోయినా బాగుండేదని అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే అంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషడిన ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ టాటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతిపై 'PD' అని రాయించుకున్న ఇంక్ మార్క్ వేయించుకోగా.. దీని అర్థం ఏంటనే ఆలోచనలో పడిపోయారు నెటిజన్లు.

కల్కిలో ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ.. డార్లింగ్ తో క్లోజ్ అయిపోయిందని, మనసు ఇచ్చేసింది కాబట్టి P ఫర్ ప్రభాస్.. D ఫర్ దిశ అన్నట్లుగా రాయించుకుందని అంటున్నారు నెటిజన్లు. కానీ కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పడేస్తున్నారు. PD ఫర్ పఠానీ దిశ అని చెప్తున్నారు. మొత్తానికి ఈ టాటూ అర్థం ఏంటో తెలియదు కానీ దిశ చేతిపై మాత్రం మరింత అందంగా కనిపిస్తుందని.. తనకు కూడా అందాన్ని తెచ్చిందని అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed