రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ

by Shamantha N |
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో హిందువుల గురించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. హిందువులని చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారని రాహుల్ తన ప్రసంగంలో అన్నారు. “నరేంద్ర మోదీ మొత్తం హిందూ సమాజం కాదు. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదు. ఇది బీజేపీ కాంట్రాక్టు కాదు” అని ఆయన కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. యావ‌త్ హిందూ స‌మాజం హింసాత్మ‌కం అని ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్ర‌మైన అంశ‌మ‌ని అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను మోడీ ఖండించారు. శివుడి ఫొటో పట్టుకుని సభలో రాహుల్ గాంధీ స‌భ‌లో ప్రసంగించడాన్ని స్పీక‌ర్ ఓం బిర్లా వ్య‌తిరేకించారు.

రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అమిత్ షాలు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని భూపేంద్ర యాదవ్ అన్నారు. దేశంలో లక్షలాది మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారని.. వారికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇస్లాం బోధనలను 'అభయ ముద్ర'తో పోల్చిన వాదనల గురించి ఇస్లామిక్ గురువులను సంప్రదించాలని చురకలు అంటించారు. కోట్లాది మంది తమను తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారని రాహుల్ కు తెలియదని అమిత్ షా అన్నారు. హింసను ఏ మతంతోనైనా ముడిపెట్టడం తప్పేనని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed