అమెరికాలో ఫ్యామిలీతో రౌడీ బాయ్.. అక్కడ కూడా విజయ్ క్రేజ్ మామూలుగా లేదుగా..

by Kavitha |
అమెరికాలో ఫ్యామిలీతో రౌడీ బాయ్.. అక్కడ కూడా విజయ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
X

దిశ, సినిమా: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఫ్యామిలి స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ, తమ్ముడు ఆనంద్, విజయ్ పేరెంట్స్ అందరూ కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు. అమెరికాలో విజయ్ ఫ్యామిలీతో దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అలాగే విజయ్ అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో అక్కడ తెలుగు జనాలు విజయ్ తో సెల్ఫీ కోసం, ఫోటోల కోసం ఎగబడ్డారు. విజయ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికాలో కూడా విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story