Romancham: సినిమాకు పెట్టింది రూ. 2 కోట్లు.. కానీ రాబట్టింది రూ.50 కోట్లు

by Prasanna |   ( Updated:2023-03-06 08:04:16.0  )
Romancham: సినిమాకు పెట్టింది రూ. 2 కోట్లు.. కానీ రాబట్టింది రూ.50 కోట్లు
X

దిశ,వెబ్ డెస్క్ : ‘రోమాంచమ్’ సినిమా మలయాళంలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి బడా స్టార్ హీరోలు ఎవరు లేరు. మంజు వారియర్ లాంటి హీరోయిన్లు కూడా కీలక పాత్రలో నటించలేదు. లీడ్ రోల్లో పోషించింది శోభిన్ షాహిర్ అనే నటుడు. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన సినిమా ఫైనల్ రన్ కు చేరక ముందే రూ. 55 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. జితు మాధవన్ దర్శకత్వం వహించిన కామెడీ, హర్రర్ , థ్రిల్లర్. సినిమా ,మొత్తం 2007 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మ చారులు బోర్ కొడుతుందని సరదాగా ఒక ఆట ఆడతారు. ఆ ఆట ఏంటంటే ఒక బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు ,నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడుతారు. ఈ గేమ్ నుంచి ఏడుగురు ఎలా తప్పించుకున్నారనేది స్టోరీ. ఈ ‘రోమాంచమ్’ సినిమా రైట్స్ కొనడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి : ‘#NTR30’ మూవీ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్‌ లుక్

Advertisement

Next Story