Roja Selvaman : ఆ హీరోయిన్ కారణంగానే రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందట..

by Anjali |   ( Updated:2023-08-28 10:15:13.0  )
Roja Selvaman : ఆ హీరోయిన్ కారణంగానే రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందట..
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు స్టార్ సీనియర్ అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్ రోజా. ప్రస్తుతం ఈ భామ సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి.. మంత్రి పదవిలో బిజీగా గడుపుతోంది. మరోవైపు బుల్లితెరపై.. ‘జబర్దస్ట్, ఢీ’ షోలల్లో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అయితే రోజా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమయంలో మీనా కారణంగానే ఈమెకు స్టార్ ఇమేజ్ వచ్చిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. విషయానికొస్తే.. శోభన్ బాబు హీరోగా నటించిన ‘సర్పయాగం’ అనే చిత్రంలో ఆయన కుమార్తెగా నటించింది. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ మీనాను ఎంపిక చేశారట.

కానీ అప్పుడే హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను అందుకునే సమయంలో మీనాను ఈ చిత్రంలో చనిపోయే రోల్‌లో తీసుకుంటే బాగుండదేమో అనుకున్నారట. తర్వాత ఆమెకు మంచి అవకాశాలు రాకపోవచ్చని ఆలోచించి.. పరుచూరి బ్రదర్స్ రోజాను తీసుకున్నారట. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో రోజాకు మరిన్ని ఛాన్స్‌లు వచ్చాయట. దీంతో మీనా ఈ మూవీలో నటింకపోవడం కారణంగానే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More : బన్నీలో నాకు బాగా నచ్చిన విషయం అదే : శ్రీరెడ్డి ట్వీట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed