- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిల్మ్ డైరెక్షన్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్: రితీష్ దేశ్‌ముఖ్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్.. డైరెక్షన్ పట్ల తనకున్న మక్కువను మాటల్లో చెప్పలేనని వెల్లడించాడు. తాను తొలిసారి దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం 'వేద్' ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రితీష్.. ఈ మూవీలో సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపాడు.
'దర్శకత్వం పట్ల ఎప్పుడో ఆకర్షితుడయ్యాను. కానీ వరుస సినిమాల్లో నటించడం వల్ల డైరెక్షన్ చేయడానికి ధైర్యం చేయలేదు. గత మూడు నాలుగేళ్లుగా ఆ పనిని దగ్గర నుంచి గమనించేందుకు ప్రయత్నిస్తున్నా. ముఖ్యంగా మరాఠీ చిత్రాలు హిందీ సినిమా నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటాయి. ఎక్కడైనా మరాఠీ కంటే హిందీ చిత్రాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మహారాష్ట్రలో మరాఠీ సినిమా హిందీ సినిమాతో పోటీపడుతూ మనుగడ సాగించడం చాలా కష్టం.
అయినప్పటికీ ప్రేక్షకులను ఎలా ఆకర్షించాలో గుర్తించాను. ఈ 12 కోట్ల జనాభా గల రాష్ట్రంలో 9-10 కోట్ల మంది మరాఠీ మాట్లాడే ప్రజలు ఉంటారని నమ్ముతున్నా. అందుకే ఇలాంటి మరాఠీ సినిమాలు ఏడాదికి రెండు రావాలి' అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : మెగాస్టార్ తండ్రిగా నటించిన ఆ సీనియర్ హీరో ఎవరో గుర్తుపట్టారా?