- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan- Renudesai: పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న రేణుదేశాయ్ ..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి, జానీ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా టైంలోనే ఇద్దరు ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని ఒకరి కొకరు దూరంగా ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. ఇదిలా ఉంటే పర్సనల్ విషయాలు ఎన్నైనా ఉండని కానీ, ఫ్యాన్స్‌కు మాత్రం ఈ జంట ఎప్పుడు ఫేవరేటే. పర్సనల్ ఇష్యూస్‌తో విడిపోయిన వీరు కలిసి ఉంటే బాగుండేదనేది ఫ్యాన్స్ కోరిక. అయితే ఈ క్రమంలోనే వీరు మళ్లీ కలవబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ప్రముఖ నటి , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌కు చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో చాలా ఫార్మల్‌గా కలిశారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖ గారికి వివరించారు. రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ బట్టలు, బంగారు గొలుసు పెట్టి సత్కరించారు.
ఈ క్రమంలోనే వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశమున్నట్లు.. అందులో భాగంగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ గురించి ఆంధ్రాలోని పెద్ద వాళ్ళతో మాట్లాడే అవకాశాలున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. అదే విధంగా ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికను కూడా పిల్లలు అలవరచుకోవాలనేది రేణుదేశాయ్ , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అభిప్రాయం. ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.