- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. టైమ్‌తో సహా క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య కామెంట్స్ వైరల్?
దిశ, వెబ్‌డెస్క్: కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు దక్కించుకుంది నటి రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బద్రి, జానీ చిత్రంలో కలిసి నటించి.. ఈ హీరోతో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకుని.. అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. కొంతకాలం తర్వాత కారణమేంటో తెలియదు కానీ రేణు దేశాయ్ - పవన్ కల్యాణ్ విడిపోయారు. పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఈమె మాత్రం పిల్లలు అకీరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ సింగిల్ గానే ఉంటుంది. పవన్ తో డివోర్స్ అనంతరం రేణు దేశాయ్ ఓ వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ పర్సన్ ఎవరనేది తెలియనప్పటికీ ఎంగేజ్‌మెంట్ మాత్రం క్యాన్సిల్ చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టడం, ఇంటర్వ్యూలో పాజిటివ్‌గా స్పందించడం కనిపిస్తుంది.
తాజాగా రేణు దేశాయ్ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ మరో మూడు సంవత్సరాల తర్వాత చేసుకుంటానని ఓపెన్ గా చెప్పేసింది. అప్పట్లో తాను నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా చెప్పింది. ఆ టైంలో అకీరా, ఆద్యలది చాలా చిన్న వయస్సు. నేను ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే నా భర్తతో సమయం కేటాయించాల్సి వస్తది. అప్పుడు నా పిల్లలు ఒంటరి అయిపోతారు. ఇప్పటికే వారు తన తండ్రకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ నేను వివాహం చేసుకుంటే వారు ఎలోన్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మరో మూడేళ్లలో వారు కాలేజ్ కు వెళ్తారు. అప్పుడు ఫ్రెండ్స్, కాలేజ్ అనే మరో కొత్త లోకాన్ని చూస్తారు. అప్పుడు పెద్దగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వరు. అందుకే ఇన్ని సంవత్సరాలు అకీరా, ఆద్యల కోసం వివాహం చేసుకోకుండా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను’’. అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక గతంలో రేణు దేశాయ్ తన పెళ్లి విషయంలో అకీరా, ఆద్యలు పాజిటివ్‌గా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో నటి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.