- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా కొడుకు జోలికి వస్తే చంపేస్తా అంటూ రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్!
దిశ, సినిమా: రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘జానీ’ మూవీలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పవన్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటున్న రేణు దేశాయ్ ఏదో ఒక రకంగా వైరల్ అవుతునే ఉంటుంది. అకీరా, ఆద్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ వైరల్ అవుతునే ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి వాటికి సీరియస్‌గానే స్పందిస్తుంది. పవన్ గురించి మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన ఎందుకు అని కౌంటర్లు ఇస్తుంది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌కి గట్టిగానే సమాధానాలు ఇస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా అకిరాను తక్కువ చేసి మాట్లాడినందుకు రేణు దేశాయ్.. ఒక నెటిజన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ కూడా హీరో అయితే బాగుంటుందని అభిమానులు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అకిరాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినా అకిరాను జూనియర్ పవర్ స్టార్ అనడం ఆపడం లేదు అభిమానులు. ఎప్పటికైనా అకిరాను వెండితెరపై చూడాలనే ఆశిస్తున్నారు. అలాంటి కామెంట్స్ పెట్టిన చాలామంది అభిమానులపై ఇప్పటికే రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. కానీ ఈసారి భిన్నంగా ఒక నెటిజన్ మాత్రం ‘వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా’ అంటూ అకిరాను తక్కువ చేసి మాట్లాడాడు. దీంతో రేణు కోపం కట్టలు తెంచుకుంది.
దాంతో‘‘ఇలాగేనా మీ అమ్మ నిన్ను పెంచింది? కెరీర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా? ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇలా మాట్లాడొచ్చా? అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా? ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండటం మంచిది. నువ్వు సిగ్గులేకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి నా కామెంట్స్లోనే తక్కువ చేసి మాట్లాడతావా? నీలాంటి మనుషులను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారా అని అసహ్యం వేస్తుంది. నా కామెంట్స్ కొంతమందికి మాత్రమే పరిమితం. అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే నా పోస్టులకు కామెంట్స్ చేయగలరు’’ అంటూ అతడిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు రేణు దేశాయ్.
అదేవిధంగా ‘‘వేరే వాళ్ల పోస్టులపై కామెంట్స్ చేసే ముందు నీకు కాస్త బుద్దిని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకుంటాను’’ అన్నారు రేణు దేశాయ్. ఈ కామెంట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేశారు. ‘‘నా గురించి మీరు ఏం మాట్లాడినా నేను భరిస్తాను. కానీ నా పిల్లలపై విషం చిమ్మాలనుకుంటే మాత్రం మీరు ఒక తల్లితో డీల్ చేస్తున్నారని మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని నాశనం చేయగలను’’ అంటూ అందరికీ ఒకేసారి వార్నింగ్ ఇచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం తను ఇచ్చిన ఈ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.