Renudesai: గత జన్మలో ఇప్పుడు పుణ్యం చేసి ఉంటా.. అందుకే వీరు లభించారు రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

by Kavitha |
Renudesai: గత జన్మలో ఇప్పుడు పుణ్యం చేసి ఉంటా.. అందుకే వీరు లభించారు రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘జానీ’, ‘బద్రి’ వంటి మూవీస్‌లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పవన్‌కు విడాకులు ఇచ్చినప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ పోతున్న రేణూ దేశాయ్ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌కి గట్టిగానే సమాధానాలు ఇస్తుంది.

ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మూగ జీవాలకు లేదా తన పిల్లలకు సంబంధించిన ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ రేణూ దేశాయ్ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన పిల్లలకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. తన మీద కూతురు ఆద్య రాసిన పోయమ్‌ను షేర్ చేస్తూ.. “నన్ను నా పిల్లలు కవితగా మార్చారు. గత జన్మలో ఇప్పుడు నేను ఎన్నో పుణ్యాలు చేసి ఉంటా.. అందుకే నాకు అకీరా, ఆద్య లభించారు” అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

(video link credits to renudesai instagram id)

Next Story

Most Viewed