‘రావణాసుర’ ప్రమోషన్స్‌లో మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ?

by Hamsa |   ( Updated:2023-04-02 05:11:05.0  )
‘రావణాసుర’ ప్రమోషన్స్‌లో మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వచ్చిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయం దక్కించుకుని అదే ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న ‘రావణాసుర’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రవితేజ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా, డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజను, సుశాంత్‌ను ఓ ఇంటర్య్వూ చేశాడు. ఇందులో భాగంగా మాస్ మహారాజా ఆడవాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవితేజ మాట్లాడుతూ.. ఏదైనా మొహం మీద చెప్పేసే ఆడవాళ్లు, ముఖ్యంగా పొగరు కలిగిన ఆడవాళ్ళు బాగా నచ్చుతారు. ఆడవాళ్లకు పొగరు ఉంటేనే బాగుంటుంది. ఒకరిపై ఆధారపడకుండా ఎవరూ లేకపోయినా నేను ఉండగలను.. అనే ఆత్మ స్థైర్యం కలిగిన వాళ్లు నాకు ఇష్టం అని తెలిపాడు. దీంతో రవితేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదేరోజు!

Advertisement

Next Story

Most Viewed