‘టైగర్ నాగేశ్వరరావు’తో రవితేజ అభిమానుల ఆకలి తీరుస్తాం: డైరెక్టర్ వంశీ

by samatah |
‘టైగర్ నాగేశ్వరరావు’తో రవితేజ అభిమానుల ఆకలి తీరుస్తాం: డైరెక్టర్ వంశీ
X

దిశ, సినిమా: రవితేజ, వంశీ కాంబోలో వస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించిన సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జి వద్ద గ్రాండ్‌గా జరిగింది. దీనికోసం మేకర్స్ రైలును హైర్ చేసుకోవడం విశేషం. తెలుగులో ఫస్ట్ లుక్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా ఇందులో రవితేజ ఫెరోషియస్ టైగర్‌లా రగ్గడ్ గెటప్‌‌లో కనిపించాడు. ‘జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా?’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఆ పాత్ర స్వభావాన్ని వివరిస్తాయి. ఇక సూపర్‌స్టార్‌ల వాయిస్‌ ఓవర్‌ ప్రజంటేషన్ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. మార్చాయి. వేర్వేరు భాషల్లో ఐదుగురు సూపర్ స్టార్‌‌లు జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ వరుసగా హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలలో టైగర్ నాగేశ్వరరావును ప్రపంచాన్ని పరిచయం చేశారు. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

Next Story