Rashmika: రష్మిక లేడి ఓరియెంటెడ్‌ మూవీ.. అమ్మాయిలకోసమేనట!

by Prasanna |   ( Updated:2023-04-03 07:38:44.0  )
Rashmika: రష్మిక లేడి ఓరియెంటెడ్‌ మూవీ.. అమ్మాయిలకోసమేనట!
X

దిశ, సినిమా: ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్‌లలో రష్మిక ఒకరు. అయితే ఈ బ్యూటీ తాజాగా ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లు తెలిపింది. శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ మూవీ లాంచింగ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా రష్మిక మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ అమ్మాయిల కోసం చక్కగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా మెయిన్ లీడ్‌గా నటిస్తున్నా. మీ అందరి కోసం ఇలాంటి ఒక పాత్రతో మీ ముందుకు రాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘రెయిన్‌బో’ మిమ్మల్ని ఖచ్చితంగా అలరించే సినిమా’ అని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 7 నుంచి మొదలుకానుంది.

Read more:

పిల్లల్ని కనడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన

ఇప్పుడు నన్ను ఆంటీ అన్నా నాకు కోపం రావట్లేదు : అనసూయ

పెళ్లైన హీరోను ఇష్టపడుతున్న సమంత.. ఎందుకంటే?

Advertisement

Next Story