శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీలో హీరోయిన్‌గా Rashmika Mandanna

by Prasanna |   ( Updated:2023-08-15 02:40:38.0  )
శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీలో హీరోయిన్‌గా Rashmika Mandanna
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన తదుపరి చిత్రం టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత రెండేళ్ల ముందే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటికి అప్‌డేట్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. దీంతో పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ వ‌రుస అప్‌డేట్స్ రివీల్ చేస్తున్నారు టీం. త్వరలోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియ‌న్ మూవీని సునీల్ నారంగ్‌, పుస్కూర్ రామోమోహ‌న్‌రావు నిర్మిస్తుండగా ఇందులో ఓ కీల‌క పాత్రలో నాగార్జున క‌నిపించ‌బోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ధనుష్ జోడిగా ర‌ష్మిక మంద‌న్న నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed