స్త్రీలను బలమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులు.. Rani Mukerji

by samatah |   ( Updated:2023-05-30 12:15:00.0  )
స్త్రీలను బలమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులు.. Rani Mukerji
X

దిశ, సినిమా: మహిళా కథానాయికలను బలమైన పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని అంటోంది రాణీ ముఖర్జీ. ఇటీవల ఆమె నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా దీనిని ఉద్దేశిస్తూ మాట్లాడిన నటి.. ‘మహిళా కేంద్రీకృత చిత్రాలు బాక్సాఫీస్‌లో సక్సెస్ అవుతున్నాయా అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే కేవలం బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాత్రమే కాదు. దాని ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ప్రజల్లోకి ఆమె పాత్ర, కథ ఎంత మేరకు వెళ్లిందనే విషయంపై కూడా అంచనాకు రావాల్సిన అవసరం ఉంది’ అంటూ స్త్రీల పాత్రల బలం గురించి తన మనసులో మాట బయటపెట్టింది.

Also Read: ఏ స్త్రీ ఈ సమస్య నుంచి తప్పించుకోలేదు.. దేశానికి అధ్యక్షురాలైనా అంతే

Advertisement

Next Story