- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rani Mukerji : నా భర్త హీరోయిన్లతో అలా చేస్తున్నపుడు.. నేను ఎందుకు చేయకూడదు?
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రాణి ముఖర్జి తన భర్త, నిర్మాత ఆదిత్య చోప్రాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆయన పలువురు మహిళలతో పనిచేసినపుడు తాను ఇతర పురుషులతో పనిచేయడంలో తప్పేంలేదని చెప్పింది. ఆమె నటించిన తాజా మూవీ ‘మిసెస్ చటర్జి వర్సెస్ నార్వే’ మార్చి 17న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ‘నా భర్త చాలా మంది హీరోయిన్స్‌తో పనిచేస్తారు. అలాంటపుడు ఇతర నిర్మాతలతో నేను ఎందుకు పని చేయకూడదు? నాకు మంచి స్క్రిఫ్ట్ దొరికితే ఎవరితోనైనా వర్క్ చేస్తా. యశ్‌రాజ్ ఫిలిమ్స్ అయినా.. ఇంకేదైనా నాకు ఓకే’ అని చెప్పింది. అలాగే తను నటించిన ఈ కొత్త సినిమా చూసి ఆదిత్య చోప్రా భావోద్వేగానికి గురయ్యారన్న రాణి.. ‘ఏదైనా సినిమా చూసి ఆయన చలించిపోవడం చాలా తక్కువసార్లు జరుగుతుంది. ఇందులో నా నటనను ఆయన బాగా మెచ్చుకున్నారు’ అంటూ ఆనందం వ్యక్తంచేసింది.