- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fire Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం, 37 మందికి గాయాలు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని జయపుర (Jayapura)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై కెమికల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. అయితే, ట్యాంక్‌లో ఉన్న కెమికల్ కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ (SMS Medical College)కి తరలించారు. ప్రస్తుతం 25 మంది ఐపీయూ(ICU)లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story