‘RRR’ స్టార్ అంటూ నేషనల్ మ్యాగజైన్‌పై రామ్ చరణ్ ఫొటో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్

by Hamsa |   ( Updated:2023-03-30 10:39:39.0  )
‘RRR’ స్టార్ అంటూ నేషనల్ మ్యాగజైన్‌పై రామ్ చరణ్ ఫొటో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తిగత విషయాలను తెలిపాడు. ఇటీవల ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు వచ్చి ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తాజాగా, నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే పత్రికపై కవర్ పేజ్‌పై రామ్ చరణ్ ఫొటోను ప్రచురించారు. అంతేకాకుండా దానికి ‘ది రోర్ ఆఫ్ రామ్’ అని కూడా వేశారు. ఈ విషయాన్ని చరణ్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ ఫొటోలు వేయకుండా ఆర్ఆర్ఆర్ స్టార్ అని చరణ్ ఫొటో మాత్రమే వేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరు కూతుర్లతో బన్నీ ఫ్యామిలీ వెకేషన్.. ఆ పుకార్లకు చెక్

శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసిన పవన్.. పిక్స్ వైరల్

Advertisement

Next Story