టీమ్ ఇండియా విజయంపై రామ్ చరణ్ ఆసక్తికర పోస్ట్.. యావత్ భారత్ గుర్తుండి పోయేలా చేశారు అంటూ

by Kavitha |
టీమ్ ఇండియా విజయంపై రామ్ చరణ్ ఆసక్తికర పోస్ట్.. యావత్ భారత్  గుర్తుండి పోయేలా చేశారు అంటూ
X

దిశ, సినిమా: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో శనివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ చివరికి టీమిండియా విజయం సాధించింది. అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే భారత్ విజయం సాధించడం పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీమ్ ఇండియాకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ X వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. టీమ్ ఇండియా అనూహ్య విజయానికి అభినందనలు. వెల్ డౌన్ టీమ్ ఇండియా. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఈ విజయాన్ని గుర్తుండి పోయేలా చేసినందుకు కెప్టెన్ రోహిత్ శర్మకి, తెర వెనుక ఉన్న టీమ్ అభ్యర్థులందరికి అభినందనలు అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Advertisement

Next Story

Most Viewed