- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pinapaka MLA: నియోజకవర్గానికి భారీగా నిధులు...
దిశ,మణుగూరు : నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన మొదటి ఎజెండా అని పినపాక ఎమ్మెల్యే(Pinapaka MLA) పాయం వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy )మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి దీపావళి విషెస్ తెలియజేశారు.అనంతరం భద్రాచలం స్వామివారి ప్రసాదాన్ని అందించారు.అనంతరం పినపాక ఏజెన్సీ నియోజకవర్గ సమస్యలపై సీఎం రేవంత్ తో సుదీర్ఘంగా చర్చించారు.పులుసు బొంత ప్రాజెక్టు,మారేళ్లపాడు లిఫ్ట్,రేగులగండి గ్రావేటికరణ,పేరంటాల చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయం సీఎంను కోరారు.
అలాగే గిరిజనుల విద్య,వైద్యానికి సంబంధించి కొన్ని సమస్యలను సీఎం చెప్పారు.దీంతో సీఎం వెంటనే సానుకూలంగా స్పందించి పినపాక నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పాయంకు హామీ ఇచ్చారు.గిరిజన బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉందని,గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు అయిన మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పాయంకి చెప్పారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఏజెన్సీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను నియోజకవర్గ ప్రజలు ఎంతో అభినందిస్తున్నారు.