- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gemanoy Culture : కలిసి మెలిసి ఎంజాయ్ చేసేద్దాం..! స్నేహం కోసం కొరియన్లు ఏం చేస్తారంటే..
దిశ, ఫీచర్స్ : మంచి స్నేహ సంబంధాలు మన జీవితాలను ఆనంద మయం చేస్తాయంటారు పెద్దలు. ఆపదలో ఉన్నప్పుడు విలువైన సలహాలు, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలో ఫ్రెండ్స్‌ను మించిన వారు ఉండరని చెప్తారు. అందుకే ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నవారి ఆయుష్షు పెరుగుతుందని కూడా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే మారిన పరిస్థితుల్లో అన్ని స్నేహాలు ఒకేలా ఉండకపోవచ్చు. రోజూ కలుసుకునే వీలు కాకపోవచ్చు. అయినప్పటికీ స్నేహ బంధం చెడిపోకుండా అనుసరించే మార్గాలు అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో కొరియన్లు అనుసరించే ‘జెమనాయ్ కల్చర్’ కూడా ఒకటి. ఇంతకీ ఈ సరికొత్త కల్చర్ ఏంటో చూద్దాం.
ప్రపంచంతో పోలిస్తే కొరియన్ల లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని చెప్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక కలిగి ఉంటారు. పైగా వీటన్నింటికీ ఓ బడ్జెట్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అందులో భాగంగానే కొరియన్ ప్రజలు స్నేహితులతో కలిసి ‘జెమనాయ్’ గ్రూపులను నడుపుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది స్నేహాన్ని మరింత బలోపేతం చేసే ఆర్థిక ప్రణాళికగా నిపుణులు చెప్తున్నారు.
జెమనాయ్ గ్రూపులోని సభ్యులంతా ప్రతి ఒక్కరూ నెలకు కొంత చొప్పున డబ్బు పోగు చేస్తారు. అలా కొంతకాలం అయ్యాక జమ అయిన డబ్బుతో ఏం చేయాలో అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. బడ్జెట్‌కు సరిపడేలా డిన్నర్లు ఏర్పాటు చేసుకోవడమో, విహార యాత్రలకు వెళ్లడమో చేస్తారు. ఇలా అందరూ కలిసి మెలిసి ఎంజాయ్ చేసే జెమనాయ్ కల్చర్ వల్ల ప్రజల మధ్య స్నేహ బంధాలు బలోపేతం అవుతుంటాయి.
అయితే స్నేహం కోసం జెమనాయ్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. ఏంటంటే.. రెండు శతాబ్దాల కిందట కొరియన్ దేశాల్లోని గ్రామాల్లో పంట పండించడానికి కావాల్సిన డబ్బులు లేదా పెట్టుబడి ఒక్కరి దగ్గర సరిపోను ఉండేది కాదట. అందుకే కొరియన్లు తలా కొంత డబ్బు వేససుకొని ఉమ్మడిగా వ్యవసాయం చేసి ధాన్యం పండించేవారు. అలా పండించిన ధాన్యాన్ని అందరూ సమానంగా పంచుకునేవారు. ఈ సంస్కృతే తర్వాత కాలంలో కమ్యూనిటీలు ఏర్పడటానికి, జెమనాయ్ కల్చర్ ఆవిర్భవించడానికి దారితీసిందని చెప్తారు.