'ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్'.. రాజమౌళిని పొగిడేసిన చెర్రీ

by Vinod kumar |   ( Updated:2023-02-23 11:09:08.0  )
ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్.. రాజమౌళిని పొగిడేసిన చెర్రీ
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ రాజమౌళిని హీరో రామ్ చరణ్ ఆకాశానికెత్తేశాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా నుంచి వెళ్లిన మొట్టమొదటి యాక్టర్‌గా రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్.. జక్కన్న గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'రాజమౌళి దర్శకత్వంలో పని చేయడం ఎలా అనిపించింది..? అని ప్రశ్నించగా.. 'రాజమౌళి అంటే 'ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్'గా భావిస్తాం.

ఆయన అద్భుతమైన ఆలోచనల నుంచి పుట్టిన ఒక అద్భుత దృశ్య కావ్యమే 'ఆర్ఆర్ఆర్'' అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ ఆన్సర్‌తో ఒక్కసారిగా షాక్ అయిన యాంకర్లు.. 'ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. మీకు అర్థమవుతుందా?' అని అడిగారు. 'కచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఆయన ఎవరో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోంది. అందరికీ ఆయన గ్లోబల్‌ స్టార్‌ డైరెక్టర్‌గానే కనిపిస్తాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story