- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మ కోసం గరిట పట్టిన రామ్ చరణ్.. ఏం స్పెషల్ చేశాడో తెలుసా?
దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుద్దీ. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు చెర్రీ. ఇక ఈయన సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంతే టైమ్ కేటాయిస్తూ వారితో సరదాగా గడుపుతాడు.అయితే ఉమెన్స్ డే సందర్భంగా చరణ్ తన తల్లి, భార్యకోసం చెఫ్‌గా మారాడు. వారికి ఇష్టమైన వంట చేసి పెట్టి తన తల్లి సురేఖ, భార్య ఉపాసన కి స్పెషల్ విషెస్ తెలిపారు. తన తల్లి కోసం చరణ్ ఏకంగా పన్నీర్ టిక్కా కర్రీ తన చేతులతో వండి పెట్టాడు, అంతే కాకుండా దోశలు కూడా వేసి వారిని సంతోష పరిచాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ వీడియోలో..చరణ్ వాళ్ల అమ్మ సురేఖ వంట గదిలో దోశలు వేస్తూ ఉండగా, ఉపాసన అత్తమ్మ గారండీ ఈరోజు మీ కిచెన్‌లో ఏమవుతుంది అని అడగ్గా..దోశలు అవుతున్నాయని చెప్పగా.. ఆ పక్కనే చరణ్ దోశలు తిప్పుతూ కనిపించారు. నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు. దానికి ఉపాసన ఈరోజు ఉమెన్స్ డే కదా.. అయితే ప్రతిరోజూ ఉమెన్స్ డే అయితే చాలా బాగుంటుంది అంటూ నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.