Pawan Kalyan జనసేన పార్టీని వదిలేసి, ఆపార్టీకి ఓటేయమంటున్న Ram Charan?

by samatah |   ( Updated:2022-12-24 05:25:59.0  )
Pawan Kalyan  జనసేన పార్టీని వదిలేసి, ఆపార్టీకి ఓటేయమంటున్న Ram Charan?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్‌కు కొదవే లేకుండా పోయింది. స్టార్స్‌కు సంబంధించిన అనేక పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తుంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట్లో తెగ హల్ చేస్తుంది.

అయితే, రామ్ చరణ్‌కు-పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండంటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావడమే లక్ష్యంగా తన ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్‌కు కాకుండా ట్రాక్టర్ గుర్తున్న పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నాడట. అయితే ఇది నిజ జీవితంలో కాదండోయ్, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్ సీఎంగా కనిపిస్తాడంట. ఈక్రమంలో ఆయన రాజకీయ ప్రచారంలో పాల్గొనగా, ట్రాక్టర్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తాడంట. ఈ విషయం క్లారిటీగా తెలియని కొందరు, జనసేన పార్టీని వదిలేసి ట్రాక్టర్ గుర్తుకు ఏంటి అని ఫైర్ అయ్యారు. కానీ ఇది సినిమాలో అని తెలిశాక సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త చాలా ట్రెండ్ అవుతోంది.

Also Read..

సమంత సినిమాపై నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Advertisement

Next Story