- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజమౌళి-రమా లవర్స్‌గా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇదే?
దిశ, సినిమా: సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. కొంతమంది నటీమణులు ఫ్యామిలీ పద్ధతులను అనుసరిస్తూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటుంటే.. మరికొంతమంది చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందే ఓ వ్యక్తితో పెళ్లై.. విడిపోయిన రమాను జక్కన్న ప్రేమించాడు.
అయితే రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు ఈయన రాసుకున్న ప్రతి ఒక స్టోరీని రమాకు వినిపించేవాడట. దీంతో ఆమె కథ ఎలా ఉందో చెబుతూ.. అందులో ఏం మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పేదట. ఈ క్రమంలో రాజమౌళి.. రమాకు అట్రాక్ట్ అయ్యాడట. జక్కన్న ప్రేమ విషయం తన తండ్రితో చెప్పి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట. ఇకపోతే రాజమౌళి - రమా వివాహనంతరం లవ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఓ సినిమా చూసేవారంటూ తాజాగా సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.
ఆ మూవీ ఏంటంటే? తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు నేను’ సినిమాను థియేటర్ కు వెళ్లి చూసేవారట. ఈ సినిమా వీరిద్దరి ప్రేమను మరింత స్ట్రాంగ్ గా చేసిందని, తర్వాత పెళ్లి చేసుకున్నామని దర్శకధీరుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి జక్కన్న-రమా పెళ్లి చేసుకుని.. ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇక రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారు.