- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ సినిమానే నాకు లైఫ్‌ని, వైఫ్‌ని ఇచ్చింది: రాహుల్
దిశ, సినిమా: యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ప్రేమికుల రోజు సందర్భంగా తన భార్య చిన్మయిని మొదటిసారి కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. తను నటించిన 'అందాల రాక్షసి' మూవీ స్క్రీనింగ్ చెన్నైలో జరుగుతున్నపుడు ఫస్ట్ టైమ్ ఆమెను చూశానన్న హీరో.. అక్కడ మొదలైన తమ పరిచయం.. ఫోన్ నెంబర్లు తీసుకోవడం డైరెక్ట్ మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్ వరకూ వెళ్లిందన్నాడు. కానీ, ప్రేమలో పడటానికి మాత్రం చాలా సమయం పట్టిందన్నాడు. 'పదకొండేళ్ల కిందటి మా జ్ఞాపకాలు. మా ప్రేమ.. పెళ్లి వరకూ తీసుకొచ్చింది. ట్విట్టర్‌లో సీరియస్ డిస్కషన్ తర్వాత జాగ్రత్తగా ఆలోచించి చిన్మయికి కొన్ని మెసేజ్‌లు పెట్టిన తర్వాత నా అభిప్రాయాన్ని చెప్పా.
'మీరు నన్ను షూట్ చేయనని మాటిస్తే.. మిమ్మల్ని డిన్నర్ లేదా కాఫీ తీసుకెళ్లాలనుంది' అని పంపించాను. దానికి 'నేను గన్ చేతిలో పెట్టుకుని తిరగను. ష్యూర్' అంటూ ఆమె బదులిచ్చింది. రిప్లయ్ వచ్చేదాకా నా గుండె సీటు బెల్ట్ లేకుండా ఫార్ములా వన్ కారులా పరుగుతీసింది. అలా మేమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకున్నాం. మొత్తానికి అందాల రాక్షసి.. లైఫ్‌ని, వైఫ్‌ని ఇచ్చింది' అంటూ చెప్పుకొచ్చాడు.