- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్య చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు.. రీఎంట్రీపై రాహుల్
దిశ, సినిమా: విలక్షణ నటుడు రాహుల్ దేవ్ తన కెరీర్ ఒడిదుడుకుల గురించి ఓపెన్ అయ్యాడు. ఎంతోమంది స్టార్ దర్శకులతో పనిచేసిన ఆయన కొన్నేళ్లుగా అవకాశాలు లేకపోవడంతోనే రియాల్టీ షో 'బిగ్ బాస్ 10'లో పాల్గొనాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు. భార్య రీనా దేవ్ క్యాన్సర్ వల్ల మరణించిన తర్వాత తమ కొడుకును పెంచడం కోసం నాలుగున్నరేళ్లపాటు అన్నింటికీ దూరంగా ఉన్నానని చెప్పాడు. అయితే తన కొడుకు చదువు కోసం విదేశాలకు వెళ్లిన తర్వాత మళ్లీ పరిశ్రమలోకి రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్న నటుడు.. 'మొదటగా ఫిట్‌నెస్ బ్రాండ్‌ని ప్రారంభించాను. కానీ అది కలిసి రాలేదు.
దీంతో తిరిగి యాక్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఎన్నో సినిమాలు చేసిన నాకు రీఎంట్రీ కష్టంగా మారింది. ఎక్కడ చాన్స్‌లు లేక చివరికి 'బిగ్ బాస్' చేయాల్సి వచ్చింది. దీనికి ఎవరినీ నిందించను. ఎందుకంటే ఇప్పుడు ఏ మార్కెట్ అయినా చాలా వేగంగా మారుతోంది' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే పిల్లలను పెంచడం అంత సులభం కాదన్న రాహుల్.. మహిళలకు అది వెన్నతో పెట్టిన విద్య అని, వాళ్లను అర్థం చేసుకునే విధానం, ఓపిక బహుశా వాళ్లకే సొంతమని, అలాంటి లక్షణాలు కలిగి ఉండటానికి ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు సహనం కోల్పోయిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నాడు.