- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
24 గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసిన పుష్పగాడు.. ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కనుంది. దీంతో గత కొద్ది కాలంగా ఎక్కడ చూసినా పుష్ప-2 గురించే చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే పుష్ప-2 నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కాబోతుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో.. పుష్ప- 2 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆరు బాషల్లో విడుదలైంది. అయితే ఈ సాంగ్ 24 గంటల్లోనే ఊహించని రెస్పాన్స్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సాధించి అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ దేశంలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది.
పుష్ప.. పుష్ప సాంగ్ మొత్తం 26.6 మిలియన్లు వ్యూస్‌ను రాబట్టింది. అంతేకాకుండా 1.27 మిలియన్ లైక్స్ వచ్చాయి. అలాగే 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ తెచ్చుకుని ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతూ ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.