- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుష్ప సినిమా నా కెరీర్‌కు ఉపయోగపడలేదు.. హాట్ టాపిక్‌గా ఫహద్ కామెంట్స్
దిశ, సినిమా: నటుడు ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో ఎస్‌పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించి అదరగొట్టేశాడు. అయితే ఫహాద్ మలయాళ ఇండస్ట్రీలో స్టార్ నటుడు.. తెలుగులో పుష్ప ఒక్క సినిమాతోనే ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆయన రేంజ్ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు పుష్ప-2 మూవీ ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ పుష్ప వల్ల తనకు ఎలాంటి లాభం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘‘ పుష్ప సినిమా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. అలాగే నేను కూడా ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఈ విషయాన్ని నేను పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముందు కూడా చెప్పాను. అది నేను దాచాల్సిన పని లేదు. అబద్ధం కూడా చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత తెలుగులో కంటే ఎక్కువ మలయాళ చిత్రాల్లోనే నటించాను.
కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మలయాళ భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్క విషయం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను నా సినిమాల వల్ల ఎవరినీ ఏ ప్రాంతాన్ని అగౌరవ పరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా లేదు. నాకు ఎలాంటి ఫేమ్ రాలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహాద్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా స్టార్ ప్రోడ్యూసర్.. టీజర్ ఈవెంట్‌ల్లోనే ప్రచారాలు..!