- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ బోర్ కొడుతోంది: షారుఖ్ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీపై స్టార్ నటి ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు గతంలో నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బీటౌన్‌లో తాను బోర్‌గా ఫీల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. విషయానికొస్తే.. ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటిని ‘నేను హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్లాలి. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది’ అనే షారుఖ్ వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన బ్యూటీ.. ‘సౌకర్యంగా ఉంటే నాకు బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అహంకారం లేదు. కానీ ఆత్మవిశ్వాసం ఉంది. నేను సెట్‌లోకి వెళ్లినప్పుడు ఏం చేస్తానో నాకు బాగా తెలుసు. ఇతరుల సలహాలు అవసరం లేదు. ఎప్పుడూ ఆడిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే పని చేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో సాధించిన విజయాల బరువుని మోసుకుంటూ వెళ్లను’ అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది.