మూడేళ్ల తర్వాత నా ఇంటికొస్తున్నా.. ప్రియాంక పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-10-12 07:01:51.0  )
మూడేళ్ల తర్వాత నా ఇంటికొస్తున్నా.. ప్రియాంక పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లి తర్వాత హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిన బ్యూటీ కొంతకాలంగా అమెరికాలోనే నివాసం ఉంటోంది. అయితే తాజాగా తను ఇండియాకు తిరిగొస్తున్నట్లు చెబుతూ హ్యాపీగా ఫీల్ అయింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టా ‌వేదికగా పంచుకున్న నటి.. తన బోర్డింగ్ పాస్ ఫొటోను షేర్ చేస్తూ 'ఫైనల్లీ.. గోయింగ్ టూ హోమ్. ఆఫ్టర్ 3 ఇయర్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అంతేకాదు జనవరిలో సరోగసీ ద్వారా స్వాగతించిన తమ కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జొనాస్‌ను మొదటిసారి ఇండియాకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే.. అలియా భట్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న 'జీ లే జరా' మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు పీసీ భారత్ వస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. ప్రియాంక ప్రస్తుత పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది.

Advertisement

Next Story