- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఆయన ఉండకూడదు..పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలోనే మాటలు తూటాల్లా పేలుతున్నాయి. వివరాల్లోకి వెళితే..ఎన్నికల ప్రచారంలో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు అనే విషయం తెలిసిందే. సినీ నటుడు పృథ్వీరాజ్ తాజాగా అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీ బాగుకోసం చిరంజీవితో పాటు ఇతర అగ్ర నటులు సీఎం జగన్ ఇంటికి రప్పించాడన్నారు. అయితే గేటు దగ్గర నుంచి ఇంటి వరకు వారిని నడిపించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని నటుడు పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.