ప్రేమదేశం పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

by sudharani |   ( Updated:2023-01-31 12:54:00.0  )
ప్రేమదేశం పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
X

దిశ, సినిమా : ఫిబ్రవరి 3న 'ప్రేమదేశం' గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. త్రిగుణ్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర నటిస్తున్న సినిమాలో సీనియర్ నటి మధుబాల కీలకపాత్రలో నటించబోతుండగా.. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు.

కాగా మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, మణిశర్మ అందించిన మ్యూజిక్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందని తెలిపారు. తప్పకుండా చిత్రం విజయవంతం అవుతుందని మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Advertisement

Next Story