- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ
దిశ, సినిమా: హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో చెయ్యబోతున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. అంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్‌తో ఇప్పటికీ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తను చిన్నప్పుడు చదువుకున్న పాలకొల్లు లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ అనే స్కూల్ నుంచి ఈ మూవీ రిలీజ్ టైంలో ప్రశాంత్ వర్మకు ఎమోషనల్ గిఫ్ట్ అందింది. తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ ‘నేను ఈ వీడియోను ‘హనుమాన్’ విడుదలకు ముందు చూశాను. అది చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ప్రశాంత్ వర్మ.
అయితే.. ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే.. ‘ప్రశాంత్ వర్మ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కు సంబంధించిన విద్యార్థులంతా ఆ స్కూల్ ప్రాంగణంలో హనుమాన్ ఆకారంలో నిలబడి ఓ వీడియో తీశారు. దానికి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రశాంత్ వర్మ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. ప్రజెంట్ అది వైరల్ అవుతోంది.