- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మే 21న పాలస్తీనాను దేశంగా గుర్తించే తేదీని ప్రకటిస్తాం : స్పెయిన్ ప్రధాని
దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి టైంలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే తేదీని మే 21న ప్రకటిస్తానని స్థానిక మీడియాకు తెలిపారు స్పెయిన్ ప్రధాని. ఈయూ ప్రకటించినట్లుగానే మే 21న పాలస్తీనాపై నిర్ణయం తీసుకుంటున్నారా అనే ప్రశ్నపై స్పెయిన్ ప్రధాని స్పందించారు. ఈయూ సహా ఇతర దేశాలతో సమన్వయం అవుతున్నామని వెల్లడించారు.
స్లోవేనియా, మాల్టా, ఐర్లాండ్ లతో పాటు స్పెయిన్ కూడా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు మార్చిలోనే ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. శాశ్వతంగా శాంతి పొందేందుకు ఇజ్రాయెల్- పాలస్తీనాల సమస్యకు పరిష్కారం అవసరమని అన్నారు.
స్పెయిన్, ఐర్లాండ్, స్లోవేనియా మే 21న పాలస్తీనా దేశాన్ని ప్రతీకాత్మకంగా గుర్తించాలని యోచిస్తున్నాయని ఈయూ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ అన్నారు. గతవారం స్పానిష్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు, ఐర్లాండ్ విదేశాంగమంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఖాయమని.. అయితే ఇంకా తేదీని ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఇక ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాల్లో 137 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. పాలస్తీనాకు ఈయూ దేశాల మద్దతు లభించినప్పటికీ.. ఫ్రాన్స్, జర్మనీ నుంచి మద్దతు దొరకట్లేదు. ఇజ్రాయెల్ తో శాంతి చర్చలు జరిపాకే ఇలాంటి ప్రత్యేక దేశ గుర్తింపు ఇవ్వాలని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి.