- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Couple Suicide: మచిలీపట్నంలో విషాదం.. రైలు కింద పడి భార్య మృతి
దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా మచిలీపట్నం (Machilipatnam)లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. టౌన్ లోని నిజాంపేట (Nizampet) ఏరియాకు చెందిన దంపతులు వాసవి - ఉప్పాల గోపీకృష్ణ మధ్య గొడవ జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వాసవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. భర్త గోపీకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో.. రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వాసవి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రేపల్లెలో కారు బీభత్సం
మరోవైపు రేపల్లె (Repalle) నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం కనకాల వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. పెడన (Pedana) నుంచి అతివేగంగా వెళ్లిన కారు.. అదుపుతప్పి ఓ ఇంటిలోకి దీసుకెళ్లింది. ఈ ప్రమాదం ఇల్లు దెబ్బతినగా.. కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నవారికి గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.