- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma:చివరి నిమిషంలో మరోసారి పోలీసులకు షాక్ ఇచ్చిన RGV
దిశ, డైనమిక్‌బ్యూరో: దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఈరోజు విచారణకు హాజరు కావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు.
ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. అయితే ఈ రోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.