- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలమాల వేస్తాననే నెపంతో కన్హయ్య కుమార్‌పై దాడి
దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా..ఆయనపై దాడి జరిగింది. కన్హయ్య కుమార్‌కు పూలమాల వేస్తానన్న నెపంతో వచ్చిన యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. శుక్రవారం సాయంత్రం ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్‌లో కన్హయ్య ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తులు కన్హయ్య కుమార్ పక్కనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మతోనూ అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై పోలీసులకు మహిళా కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మంది ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలపై దుండగులు నల్ల ఇంకును చల్లారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఒక యువకుడు కన్హయ్య కుమార్ దగ్గరికి వచ్చి మొదట పూలమాల వేసి.. ఆ వెంటనే కన్హయ్యపై దాడి చేశాడు. దీంతో కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే అతడిని పట్టుకున్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీ స్థానంలో కన్హయ్య కుమార్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. మే 25న ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.