వారి కోసం ప్రత్యామ్నాయ డిజిటల్ కేవైసీ.. కేంద్రం, ఆర్బీఐకి ‘సుప్రీం’ నోటీసులు

by Shamantha N |
వారి కోసం ప్రత్యామ్నాయ డిజిటల్ కేవైసీ.. కేంద్రం, ఆర్బీఐకి ‘సుప్రీం’ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో : యాసిడ్ దాడి బాధితుల కేవైసీ డిమాండ్ పై కేంద్రాని, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. యాసిడ్ అటాక్ లో కన్ను కోల్పోయిన వ్యక్తుల కోసం ప్రత్యామ్నాయ డిజిటల్ కేవైసీ ప్రక్రియను కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రానికి, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ ముఖ్యమైన అంశం అని పేర్కొంది సుప్రీం ధర్మాసనం. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.ఈ కేసులో తదుపరి విచారణ జూలైలో జరగనుంది.

యాసిడ్ దాడి నుంచి బయటపడి కన్ను కోల్పోయిన వారి కోసం ప్రత్యేక డిజిటల్ కేవైసీ ప్రక్రియ కోరుతూ సామాజిక కార్యకర్త ప్రజ్ఞా ప్రసూన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైనే సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కేవైసీని ఆఫ్‌లైన్ మోడ్‌లో.. ముఖాముఖిగా పూర్తి చేయాలని చాలాసార్లు అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు తమ సమస్యలను పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకం ఇవ్వాలని కోరారు.

లైవ్ ఫోటోగ్రాఫ్‌లు అందించడంపై పిటిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైవ్ ఫోటోగ్రాఫ్‌లలో రెప్పపాటు కళ్లకు సంబంధించిన ప్రమాణాలను మార్చాలని కోరారు. అంతేకాకుండా, లైవ్ ఫోటో అవసరాన్ని మార్చాలని లేదా సవరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సూచించాలని కోరారు.

Advertisement

Next Story