Prabhudeva: ‘అవును నేను తండ్రి అయ్యాను’ స్వయంగా వెల్లడించిన ప్రభుదేవా!

by Anjali |   ( Updated:2023-06-12 14:17:23.0  )
Prabhudeva: ‘అవును నేను తండ్రి అయ్యాను’ స్వయంగా వెల్లడించిన ప్రభుదేవా!
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక నిర్మాత, కొరియోగ్రాపర్, హీరో అయిన ప్రభుదేవా ‘‘నేను 50 ఏళ్ల వయస్సులో తండ్రయ్యానని’’ చెప్పి నెటిజన్లకు షాకిచ్చాడు. ఈ హీరో మొదటి భార్య రామలతకు 2011లో డివోర్స్ ఇచ్చారు. అనంతరం నయనతారతో ప్రేమాయణం కొనసాగించాడు. ఏమైందో తెలియదు కానీ, త్వరలో పెళ్లి అనే టైమ్‌కు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్లు సింగిల్‌గా ఉన్న ప్రభు 2020 లో డాక్టర్ హిమానీ సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచగా.. ప్రభుదేవా 50 వ పుట్టినరోజును హిమానీ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడంతో బయటపడింది. కాగా.. హిమానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని స్వయంగా ప్రభుదేవానే స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story