Prabhas : ఒకేసారి మూడు ప్రాజెక్టులు.. ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్

by sudharani |   ( Updated:2024-09-20 14:08:08.0  )
Prabhas : ఒకేసారి మూడు ప్రాజెక్టులు.. ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్
X

దిశ, సినిమా: ఇటీవల ‘కల్కి 2898AD’తో భారీ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రజెంట్ తన తదుపరి చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘సలార్-2, రాజాసాబ్, స్పిరిట్, కల్కి-2’ వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' కూడా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వీటిలో సలార్-2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కాస్త సమయం పట్టేలా ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నాడు డార్లింగ్. ఈ క్రమంలోనే ప్రజెంట్ ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీని చిత్రీకరణ పూర్తైన తర్వాత.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వాలని అనుకున్నారట.

కానీ ‘రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా జరుగుతూనే ఉండగా.. హను రాఘవపూడి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు మధురైలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైందని తెలుస్తుంది. అయితే.. ఇందులో ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్. ఒక వారం రోజులు పాటు జరగనున్న ఈ 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతారని టాక్. వీటితో పాటు ‘కల్కి-2’ చిత్రీకరణ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణలో కూడా త్వరలో ప్రభాస్ పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైన ఒకేసారి మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చెయ్యడం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యం అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

Advertisement

Next Story