Pooja hegde: ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డే మీద కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్

by Prasanna |   ( Updated:2023-04-23 09:36:06.0  )
Pooja hegde: ఐరన్ లెగ్ అంటూ  పూజా హెగ్డే మీద  కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమైన పూజా హెగ్డే.. ఆ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో.. రెండేళ్లు గ్యాప్ తీసుకోని హిందీలో ఒక భారీ సినిమా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో హిందీ కూడా కలిసి రాలేదని మళ్లీ తెలుగులో అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లింది. కొంత కాలం మొదటి స్థానంలో కొనసాగింది. కానీ ఈ మధ్య ఈ ముద్దు గుమ్మ మీద ఎవరు ఆసక్తి చూపించడం లేదు. తెలుగులో ఆఫర్లు లేక హిందీలో 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో నటించింది. ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ రావడంతో ఐరన్ లెగ్ అంటూ పూజా మీద కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా విజయం సాధిస్తేనే అవకాశాలు వస్తాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

అమితంగా ఆకట్టుకుంటున్న ‘ఫర్హానా’ టీజర్

Advertisement

Next Story