మనీలాండరింగ్ కేసులో Jacqueline Fernandez కు మరోసారి నోటీసులు

by Hajipasha |   ( Updated:2022-09-13 13:23:18.0  )
మనీలాండరింగ్ కేసులో Jacqueline Fernandez కు మరోసారి నోటీసులు
X

దిశ, సినిమా: రూ. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే తనతో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏ ప్రేమలో ఉందని.. ఆమె అతడి నుంచి భారీ మొత్తంలో కానుకలు అందుకుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే చంద్రశేఖర్‌పై ప్రస్తుతం పదికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటి గురించి జాక్వెలిన్‏కు తెలిసినప్పటికీ అతనితో ఆర్థికలావాదేవీల్లో పాల్గొన్నదని ఈడీ తాము దాఖలు చేసిన చార్జిషీట్‏లో ప్రస్తావించింది. 2021 ఆగస్టు 30, అక్టోబరు 20న ఫెర్నాండెజ్ స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశామని, చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించిందని ఈడీ గతంలోనే పేర్కొంది. అంతేకాకుండా ఈ ఆదాయాన్ని ఇండియాతో పాటు విదేశాల్లో తనకు తన కుటుంబ సభ్యుల కోసం ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది.

Advertisement

Next Story