UPI చెల్లించండి.. ప్రతిరోజూ సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్ వినండి!!

by Anjali |   ( Updated:2024-02-21 15:31:16.0  )
UPI చెల్లించండి.. ప్రతిరోజూ సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్ వినండి!!
X

దిశ, సినిమా: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ హీరో 25 బ్రాండ్స్ వరకు ప్రమోట్ చేశారు. తాజాగా ప్రిన్స్ మరో యాడ్ లో చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రజలందరూ ఉపయోగించే ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లకు సూపర్ స్టార్ వాయిస్‌ను ఇస్తున్నారు. ఎవరైనా సరే ఫోన్ పే నుంచి మనీ పంపించినప్పుడు అండ్ డబ్బు రిసీవ్ చేసుకునేటప్పుడు ఇకపై మహేష్ గొంతు వినిపిస్తుంది.

‘‘మనీ రీసివ్డ్’’ అంటూ వాయిస్ వచ్చే విషయం అందరికి తెలిసిందే. ఆ పదాల్ని ఇప్పుడు ఈ హీరో వాయిస్‌తో రావడం విశేషం. దీనికోసం ప్రిన్స్ వాయిస్‌తో కొన్ని శాంపిల్స్ తీసుకుని ఏఐ వాయిస్‌ను జెనెరేట్ చేశారట. గతంలో స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గొంతులో ఫోన్‌పే లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌తో ఫోన్ పే లావాదేవీలు జరగనున్నాయని తెలియడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ ఊర మాస్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. శ్రీలీలతో ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాస్ సాంగ్ కు స్టెప్పులేసి బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రిన్స్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read More..

బ్యూటీ సితార, పవర్ స్టార్ వారసుడు అకిరా కాంబినేషన్‌లో మూవీ!

Advertisement

Next Story