Sai Dharam Tej : పవన్ మావయ్య నా పెళ్లి కాకుండా చేశాడు

by Anjali |   ( Updated:2023-07-17 13:46:49.0  )
Sai Dharam Tej : పవన్ మావయ్య నా పెళ్లి కాకుండా చేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘విరూపాక్ష’ చిత్రంతో కెరీర్‌లో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం తన మామయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘బ్రో’ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించారు. అక్కడ సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా.. ‘ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ మూవీకి ముందే కొంత మందైనా ట్రై చేసేవారు. ఈ సినిమా చూశాక, అమ్మాయిలందరూ నన్ను బ్రో అని పిలుస్తారేమో. ఇక నాకు వివాహం ఎక్కడ అవుతుంది. ఇదంతా పవన్ మావయ్యే చేశాడు.’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story