- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆద్య కోసం ఆ పని నేర్చుకున్న పవన్ కళ్యాణ్..కూతురంటే ఎంత ఇష్టమో! !
దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి తన అభిమానులందరిలో ఉత్సాహాన్ని నింపాడు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతులకు అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ విడిపోయిన తర్వాత పిల్లలు రేణు దేశాయ్ తోనే ఉంటున్నారని తెలిసిందే. అయితే ఇక పవన్ కళ్యాణ్ పిల్లల్ని చూడాల్సిన ప్రతిసారి మహారాష్ట్రకు వెళ్లి వాళ్ళను కలిసి వస్తూ ఉంటారు.
అయితే రేణు దేశాయ్ అకీరా నందన్ తో ఇంట్లో తెలుగులో మాట్లాదుతుందంటా.. కానీ ఆధ్య తో మాత్రం మరాఠీలో మాట్లాడుతుందట. ఇక పవన్ కళ్యాణ్ ఆద్యను కలిసినప్పుడు ఆమెతో మాట్లాడటానికి మరాఠీ నేర్చుకున్నాడట. కేవలం 30 రోజుల్లోనే దాదాపు 80% మరాఠీ మాట్లాడటం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తన కూతురు అంటే తనకి ఎంత ఇష్టమో ఈ రకంగా తెలియజేశాడని చాలామంది చెబుతూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికినా ప్రతిసారి పిల్లల తో కూడా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.