- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA గా పవన్ కల్యాణ్ జీతం ఎంతో తెలుసా?వారి కోసం కోట్ల సంపదను మిస్ చేసుకున్న గొప్ప వ్యక్తి!
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ చరిత్రలో వందకు వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి తనతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన అందరినీ చట్టసభల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ జీతభత్యాలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా నెలసరి జీతం ఎంత తీసుకుంటాడని నెట్టింట గట్టి చర్చ జరుగుతోంది.
ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇతర అలవెన్స్‌లు అన్నీ కలుపుకుని రూ.3.35 లక్షల జీతం అందుకుంటున్నారు. కాగా పవర్ స్టార్‌కు కూడా ఈ మొత్తా్న్నే నెల జీతంగా అందుకుంటారు. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం రూ.4 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సామర్థ్యం ఉన్న నువ్వు.. రూ.3.35 లక్షల కోసం అన్నీ వదులుకొని వెళ్లావంటే.. ప్రజాసేవ పైన నీకున్న మక్కువ ఏంటో అర్థం అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపునం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.