Pawan Kalyan: ఆ హ్యాష్ ట్యాగ్‌తోనే సినిమా టైటిల్ ఫిక్సయిందా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-29 09:07:28.0  )
Pawan Kalyan: ఆ హ్యాష్ ట్యాగ్‌తోనే సినిమా టైటిల్ ఫిక్సయిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నారు. అందులో సుజీత్ సినిమా కూడా ఉంది. సినిమా అనౌన్స్ మెంట్ సమయంలో టైటిల్ ప్రకటించని చిత్ర యూనిట్.. #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ తో దీన్ని ప్రమోట్ చేసింది. ఇప్పుడు దానినే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారని సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య ఐదు భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేశారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ కూడా రావొచ్చని తెలుస్తోంది. దీన్ని బట్టి పాన్ ఇండియా సినిమాగా OG రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ టైటిల్‌గా ఫిక్స్ చేయడం, అభిమానుల్లో మరింత జోష్ నింపిందని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి: Mahesh Babu: SSMB28 నుంచి మరో కొత్త అప్డేట్!

Advertisement

Next Story