ఎన్టీఆర్‌కు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

by GSrikanth |
ఎన్టీఆర్‌కు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషెస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు. అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకొని సినీ ప్రముఖుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్‌కు మరిన్ని విజయాలు అందుకోవాలి. ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలి’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, నేడు ఎన్టీఆర్ 41వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చేశాయి.


Advertisement

Next Story