- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీకి దూరం చేసిన ఆ ఇద్దరు హీరోలు.. దిక్కుతోచని పరిస్థితిలో..
దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలలో దర్శకుడు, హీరో, హీరోయిన్స్, యాక్టర్స్.. వీరంతా ఒక ఎత్తైతే సినిమా హిట్ అయ్యేందుకు ఎంతటి భారీ బడ్జెట్ పెట్టైనా సరే హిట్ కొట్టేందుకు నిర్మాతలు బాధ్యతలు తీసుకుంటారు. అయితే కొందరు మాత్రం అతి తక్కువ ఖర్చుతో సినిమా నిర్మించి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేసి పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంటుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం డబ్బు ఉన్నా మంచి కథను ఎంచుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోతూ ఉంటారు. అందులో నిర్మాత శింగనమల రమేష్ బాబు ఒకరు.
గతంలో స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి', మహేష్ బాబు నటించిన 'ఖలేజా' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి.. సర్వస్వం కోల్పోయి ఏకంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన వ్యక్తి శింగనమల రమేష్ బాబు. అయితే ఈ నిర్మాత రెండు సినిమాలకు ఫైనాన్షియర్‌ల నుంచి అప్పులు తీసుకుని దాదాపు రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టగా.. చివరకు అవి సాధించిన కలెక్షన్లు రూ. 30 కోట్లు మాత్రమే కావడం గమనర్హం. దీంతో ఏకంగా రూ. 50 కోట్లు నష్టాన్ని చవిచూశాడు. అనంతరం అప్పులు తిరిగి చెల్లించడంలో పూర్తిగా విఫలమైన రమేష్ బాబు ఇక అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇక అప్పట్లోనే ఈ హీరోస్ తనని ఆదుకుని ఉంటే ఖచ్చితంగా సరికొత్త సినిమాలతో నిర్మాతగా విజయాలు సాధించేవారు. ఏదేమైనప్పటికి ఈ ఇద్దరి హీరో సినిమాల కారణంగానే నిర్మాత రమేష్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.